Neethone Nenu Title Poster launched: బజ్జీల పాపగా పాపులర్ అయిన కుషిత కళ్లపు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘నీతోనే నేను’ అనే సినిమా తెరకెక్కింది. అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ…