నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
NEET : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
నీట్ పరీక్ష ఫలితం 2024 ప్రకటించిన తర్వాత.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమగ్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫలితాల్లో 720కి 720 మార్కులు తెచ్చుకున్న 67 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు చూసిన తర్వాత ఇంత మంది పిల్లలకు పూర్తి మార్కులు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలు తలెత్తాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌కు చెందిన ఇషా కొఠారి మొదటి ర్యాంక్ సాధించింది.