దేశవ్యాప్తంగా నీట్‌పై నెలకొన్న ఉత్కంఠ ప్రభావం సోషల్ మీడియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్య గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థిని 12వ మార్కు షీట్ వైరల్ అవుతోంది. ఈ విద్యార్థి నీట్‌లో 705 మార్కులు సాధించినట్లు మార్కుషీట్ లో పేర్కొన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం నీట్ 2024 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వగా, వారిలో 67 మంది అభ్యర్థులు నంబర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొంది.