బీహార్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం పాట్నాలో కేంద్ర మంత్రులు జేడీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు.