పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…