నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “NBK107”. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనుండగా, దునియా విజయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు తమన్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.…