కరోనా మహమ్మారి తరువాత థియేటర్లలో సినిమాల సందడి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10, శుక్రవారం కూడా థియేటర్ తో పాటు ఓటిటిలో కూడా దాదాపుగా ఏడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో థియేటర్లలో అలాగే ఓటిటిలలో ప్రీమియర్ అవుతున్న చిత్రాలను చూద్దాం. నాగ శౌర్య స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ “లక్ష్య”తో సిద్ధమయ్యాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. శ్రియ, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో…
నరహంతక నయీమ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతని బయోపిక్ ను ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలనే రెండు భాగాల ‘రక్తచరిత్ర’గా తీసిన వర్మ, నయీమ్ కథను మూడు భాగాల చిత్రంగా ప్లాన్ చేశాడంటే, నయీమ్ జీవితంలోని డెప్త్ ను అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏవైనా వర్మ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఆ సినిమా కోసం కథను తయారు చేసిన…
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. దీనిని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయన్నది ధైర్యంగా ఈ సినిమాలో చూపించామని దర్శకుడు దాము చెబుతున్నారు. నయీం…