విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.