ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. రాత్రి మళ్ళీ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గత నాలుగు రోజుల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్ తో పాటు భాస్కర్ మృతి చెందారు. భద్రతా బలగాలు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. Also Read:Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి…
బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.
Maoists : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్’గా కొనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల…
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు.