Kishan Reddy : నక్సలిజం నిర్మూలనలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవనంలో కలవడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. గత మూడు రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు అధికారాల వద్దకు వచ్చారని కిషన్ రెడ్డి…