Amit Shah Srinagar Visit: జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం శ్రీనగర్‌ను సందర్శించే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. అమిత్ షా సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారని వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరకుని పోలీస్ స్టేషన్ లోపల జరిగిన పేలుడు సంఘటన గురించి షా…
Srinagar Blast: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై…