ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం (NPS)కింద ఇచ్చే వాటా పెంచింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏఐఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
Universal Pension Scheme: భారతీయులందరి కోసం కేంద్ర కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంఘటి రంగంలోని వారితో సహా అందరు పౌరులకు అందుబాటులో ఉండేలా ‘‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’’పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగంలోని వారికి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలు అందుబాటులో లేవు.