FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Tallest flag in india on the Attari border: దేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లోని అట్టారీ వద్ద 418 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రెండు దేశాల మధ్య జెండా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అట్టారీ-వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ వైపు భారత్ కన్నా పెద్దదైన పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేశారు.…