‘నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడు రోజులు వరుసగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే! మొత్తం 28 గంటల పాటు జరిపిన విచారణలో అధికారులు రాహుల్‌కి ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఈరోజు (గురువారం) మాత్రం విచారణ నుంచి రాహుల్ గాంధీకి విరామం ఇచ్చారు. అయితే.. శుక్రవారం నాడు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనంటూ ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ మాత్రం…