Earthquake: దేశంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈ రోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.