నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు.
BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
నర్సాపూర్ గెలుపు బాధ్యత సీఎం కేసీఆర్ నాపైనే వేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం నర్సాపూర్‌కి రావడం అదృష్టమన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చెప్పుకోదగ్గ నేత ఒక్కరూ కనిపించటం లేదట. ఒక్కరైనా దొరకరా అని అధిష్టానం ఎంత వెతికినా ప్రయోజనం లేదట. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయటం ఆ పార్టీ పెద్ద టాస్క్‌లా మారిందట.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. కాంగ్రెస్ తరపున సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు వరుసగా గెలుపొందారు.…
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు…