టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో వస్తోన్న “క్రేజీ కల్యాణం” చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న “క్రేజీ కల్యాణం” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తుండగా బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పెళ్లి…