స్వగ్రామం నారావారిపల్లెలో సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం.. నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో మంత్రులు వంగలపూడి అనితా, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, ఎస్ సవితా, వాసం శెట్టి…