2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు అని పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని.. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.…