(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు.…