నేచురల్ స్టార్ నానిలో చమత్కారి ఉన్నాడు. బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చిన నానిలో క్రియేటివిటీ పాలు ఎక్కువే! మీరు జాగ్రత్తగా గమనిస్తే… అతను నటించిన సినిమాల ప్రారంభంలో వచ్చే ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కాన్సర్ కు కారకం’ అనే ప్రకటన వాయిస్ ఓసారి వినండి… అది రొటీన్ కు భిన్నంగా ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో అయితే ‘సిగిరెట్, మందు తాగకండిరేయ్… పోతారు’ అని చెప్పాడు…