Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట సమీపంలో NH 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపి ఉండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢికొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరగ్గానే బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. కొందరు బస్సులో కిందపడి గాయపడ్డారు. చీకట్లో ఏమి జరిగిందో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించి బస్సులోపలికి వెళ్లి లారీని పక్కకి లాగారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు.
READ MORE: Shiva Jyothi : తిరుమల ప్రసాదం వివాదం.. క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి