Nanditha Swetha: ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ నందితా శ్వేత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందిత తెలుగువారికి దగ్గర అయిపోయింది. విజయాపజయాలను పక్కనపెడితే ఈ చిన్నది అవకాశాలను అయితే బాగానే అందుకుంటుంది. ఇక ఈ మధ్యనే హిడింబ సినిమాలో అశ్విన్ బాబుతో రొమాన్స్ చేసింది.