గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్‌లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్‌లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Also…
ACB Raids: హైదరాబాదులో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు మరో మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంబేడ్కర్ నివాసం ఉంటున్నారు. నాననక్‌రాంగూడలోని ఆంట్యార్ అబ్డే అపార్ట్‌మెంట్ లోని అంబేడ్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అంబర్ పేట్ లో బాలుడి మృతి ఘటన లాంటివి తరచూ జరుగుతున్నాయి. వీధి కుక్కలు చిన్నపెద్ద అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిత్యం రద్దీగా వుండే గచ్చిబౌలి విప్రో జుంక్షన్ నుండి IIIT జుంక్షన్ వైపు బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. IIIT జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బైక్. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి…
హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 3 అంతస్థులలో సిలిండర్ పేలుడు ధాటికి గదులు కూలిపోయాయి. ఉదయం సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక కనెక్షన్ లీకేజ్ తోనే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం వుంటున్నారు. భవనంలో ఎక్కువగా యూపీ బీహార్ కు…