Nampally Exhibition:ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)కి సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 83వ నుమాయిష్ ప్రారంభోత్సవానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు.
నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భవనంలో సేఫ్టీ లేదని ఫైర్ శాఖ వెల్లడించింది. అయితే, కెమికల్ డ్రమ్స్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది.
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
IMD Hyderabad: తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. తెలంగాణ, ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.
Sabitha Indrareddy: తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నాంపల్లి రూసా బిల్డింగ్ లో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం కొనసాగింది.
హైదరాబాద్ నాంపల్లిలో రెండు హత్యలు కలకలం రేపాయి. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలపై రాయితో మోది హత్యకు పాల్పడ్డారు నిందితులు. అలాగే, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా రాయితో తలపై బాది చంపేశారు. రెండు సంఘటనల్లో ఇద్దరిని హతమార్చిన వ్యక్తి ఒక్కడే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీ…