Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు.