దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నాగ్‌పుర్‌లో ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. దీంతో.. జనాలు బెంబెలెత్తిపోయారు. అయితే.. అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి నిజం కాదని తేల్చింది.…