తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతలలో భూమి స్వల్పంగా కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఉదయం 5 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే, భూప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పోరల్లోకి నీరు చేరడం వలన భూప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. …
వారిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. కలిసి సాగాల్సిన చోట కత్తులు దూసుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల ఎంట్రీ వారి మధ్య ఇంకా గ్యాప్ తెచ్చిందట. ఎవరా నాయకులు? ఏమా కథ? వేడెక్కిస్తున్న నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ రాజకీయం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. సందర్భం వస్తే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇదే…