ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో ట్రాప్ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ రోజు (సోమవారం, నవంబర్ 17) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను నాగార్జున పంచుకున్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి…