కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శివ సినిమా నాగార్జునకు మాస్ ఇమేజ్ తేవడమే కాక.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ధోరణిని మార్చడమే కాకుండా.. టెక్నికల్‌గానూ ట్రెండ్ సెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా.. నవంబర్ 14న శివ రీ…