నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. కానీ, అప్పుడే ఈ సినిమా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌వైడ్ థియేటర్ హక్కుల కొనుగోలు జరిగిపోయింది. ఏపీ, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, అలాగే ఇండియాలోని ఇతర రాష్ట్రాలన్నీ కలిపి…