తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ తన లైనప్ లో ఉన్న సినిమాలని కంప్లీట్ చెయ్యగానే తెలుగు దర్శకుడితో సినిమా చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో వారసుడు సినిమా చేశాడు దళపతి విజయ్. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని…