ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పడు నాలుగో సినిమాకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈసారి వీరి కాంబినేషన్‌లో రాబోయేది ఒక భారీ మైథలాజికల్ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంలో తెరకెక్కనుంది. GodOfWar పేరుతో రాబోతున్నఈ సినిమా…