Myanmar Earthquake: భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 1000ని దాటింది. భవనాల శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌ని భూకంపం వణించింది. 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. భూకంప లోతు 10 కి.మీగా ఉంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.