తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది.