Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.