ఒకరేమో మాజీ ఎమ్మెల్యే. మిగతా ఇద్దరిదీ అక్కడ టికెట్ సంపాదిస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చనే ఆశ. ముగ్గురూ ముగ్గురే. ఎవరి ఎత్తులు వారివే. పార్టీలోని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే అంశం చిక్కితే.. రచ్చరచ్చ చేసి విడిచి పెడుతున్నారు. వారెవరో? ఆ నియోజకవర్గం ఏంటో? లెట్స్ వాచ్..! దళిత సర్పంచ్ సస్పెన్షన్‌పై మునుగోడు టీఆర్ఎస్‌లో రగడ..! నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా.. టీఆర్ఎస్ నాయకుల్లో వర్గపోరు పులుపు చావలేదు. నేతలు ఎక్కువ..…