ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం మునుగోడులో బెల్ట్ షాపులు ఉండవని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఎవరి మాట విననని అన్నారు. పదవి పోయినా బెల్ట్ షాపులను తెరవనివ్వనని కరాఖండిగా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయమని అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు.. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో టికెట్ చేజారింది.. అధిష్టానం సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.