ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారడంతో ఎమ్మెల్యే, మంత్రులు సైతం నియోజకవర్గంలోనే తిష్టవేసి ప్రచారం సాగిస్తున్నారు.