కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పీఎం, సీపీఐ నేతలతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సమర్పించనున్నారు.