Vemulawada : దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వచ్చిన వేములవాడ పట్టణంలోని రోడ్ వెడల్పు పనులకు ఆదివారం అధికారులు ప్రారంభసూచి ఇచ్చారు. మటన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ దుకాణాలను అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజన్న ఆలయం వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 260 నిర్వాసితులలో…