దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజుకో చోట అగ్ని ప్రమాదం జరుగుతుంది. తాజాగా.. ముండ్కా ప్రాంతంలోని ఎల్ఈడీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. 40 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై.. చీఫ్ ఫైర్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, 'ఉదయం 7 గంటల ప్రాంతంలో చెత్తకు నిప్పంటుకున్నట్లు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. అప్పటికే..…
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు.…
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.…