(జూన్ 28న ముళ్ళపూడి వెంకటరమణ జయంతి)ముళ్ళపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయమార్గం పట్టించింది. చిత్రసీమలో అడుగు పెట్టకముందే ముళ్ళపూడి వారి కలం బలం తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే! సినిమా రంగంలో అడుగు పెట్టాక ముళ్ళపూడివారికి సుందర్ లాల్ నహతా, డూండీ కాంపౌండ్ లో చోటు దక్కింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాశమలర్’ చిత్రాన్ని తెలుగులో యన్టీఆర్, సావిత్రితో ‘రక్తసంబంధం’గా రీమేక్ చేశారు. ఈ రీమేక్ సినిమాతోనే ముళ్ళపూడి వారి రచన చిత్రసీమలో మొదలయింది. తెలుగులో ‘రక్తసంబంధం’…