Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి,…