ఐపీఎల్ 2025లో ‘అన్‌క్యాప్‌డ్ ప్లేయర్’ రూల్‌ను మరలా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లీగ్ మొదటి నుంచి ఈ రూల్ భాగంగా ఉన్నా.. ఏ ప్రాంచైజీ ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఏ భారత ఆటగాడైనా అయిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండకపోతే.. అతడిని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ…
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను ముందుగానే రిటైన్ చేసుకోవచ్చు లేదా మెగా వేలంలో ఆర్‌టీఎం ద్వారా రిటైన్ చేసుకోవచ్చు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే బీసీసీఐ ఓ రూల్‌ను మరలా తీసుకొచ్చింది. ఐపీఎల్ 2025లో…