విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న ఎంపీ కేశినేనా నాని.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టా.. కానీ, మీడియాకు కావాల్సింది మసాలెనేగా.. తినబోతూ రుచులెందుకు..? అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు.
తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం.
విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రోజు కీలక కామెంట్లు చేశారు.. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు.. రాజకీయాల్లో నేను, నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదు.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని తెలిపారు.. వైసీపీ…