హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన హైదరాబద్ పార్లమెంట్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు.. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపల్ల మాధవీలత, డా. లక్ష్మణ్ ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదటి జాబితాలోని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించారని, ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనమైన…
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్‌కు కారణం అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది…
K. Laxman: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా ఉందని రాజ్యసభ ఎంపీ డా.కె లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో CSF నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్మణ్ పాల్గొని..
దేశం లో ఎక్కడికి వెళ్ళినా మోడీ కి బ్రహ్మరథం పడుతున్నారని, అది చూసి కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నారన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే మోడీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారని, కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోడీ అనుకుంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదని, రోజుకు 18 గంటలకు పైగా పని చేస్తున్న మోడీ నీ…
కొత్త బిచ్చగాడు పొద్దేరుగడన్నట్లు ఉంది..ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యిన వారు పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్. ఇవాళ పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి అయ్యామని అద్ధూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.. వీళ్ళ మారుస్తున్న రంగులు చూసి అంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీ లో ఎందుకు అంటూ ఆయన విమర్శలు…
మూడో సారి మోడీ ప్రధాని చేయడానికి చేపట్టిన యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర అని అన్నారు బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్. ఇవాళ ఖైరతాబాద్ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాధ్యం అనే దాన్ని సుసాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోడీది అని ఆయన కొనియాడారు. ఆర్టికల్ 360 నీ రద్దు చేసే విషయంలో కేవలం మోడీ ఘనతేనన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్నటువంటి త్రిబుల్…
నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ…
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే…
500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని… ముఖ్యంగా భవ్య మందిర నిర్మాణంలో కరసేవకుల పాత్ర కీలకమని, వారి త్యాగం చిరమస్మరణీయమని కొనియాడారు. ఎంతోమంది వారి జీవితాలను త్యజించి, కుటుంబాలను వదులుకొని సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నరేంద్ర మోడీ…
లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.., బీఅర్ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని ఆయన ఆరోపించారు. బీఅర్ఎస్ నాయకుల…