కేసీనో విషయంలో దొంగ పోలీసులు ఒక్కయ్యారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గుడివాడకు వెళ్లటం ఖాయం మేము చేయాల్సిన కార్యక్రమం చేసి తీరుతామని సీఎం రమేష్ అన్నారు. గుడివాడకు వెళ్ళకుండా ఎందుకు అవుతున్నారు.. క్యాసినో వ్యవహారం తేలుస్తామన్నారు. గుడివాడ డీఎస్పీకి తెలియకుండా మూడు రోజులు క్యాసినో జరిగిందా.. అని సీఎం రమేష్ ప్రశ్నించారు. క్యాసినో పేరుతో ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చెప్పాలన్నారు. Read Also: బీజేపీ నేతల అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత…
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.…