మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.…