ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశం ఫలప్రదమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్ల పైన కూడా ఈ నెల మూడో వారంలోనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం…